30 March, 2026 | 5:05 AM

జాతరలు బీసీల సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక

30-03-2026 12:00 AM
  1. జాతరలన్నీ ఉత్పత్తి కులాల ప్రతీకలే
  2. సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
  3. వచ్చే నెల 19న ‘బీసీ జన జాగరణ జాతర’ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): బీసీల హక్కుల సాధనకు జరుగుతు న్న ఉద్యమాలకు సమాంతరంగా సాంస్కృతిక ఉద్యమాలు కూడా పెద్దఎత్తున చేపట్టా ల్సిన అవసరం ఉన్నదని బహుజన ఉద్యమ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. బీసీల సాంస్కృతిక సామాజిక ఉద్యమమే ధ్యేయంగా నిర్వహించే బీసీ జన జాగరణ జాతరలు బీసీల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని చెప్పారు.

ఏప్రిల్ 19న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బీసీ జన జాగరణ జాగృతి పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్‌రావుతో కలిసి గౌరీశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. బీసీలలో ఐక్యతను సాధించడానికి, కుల చైతన్యాన్ని బీసీ సామాజిక ఉద్యమ చైతన్యంగా మార్చడానికి బీసీ జాతరలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు.

జాతరలన్నీ ఉత్పత్తి కులాల ప్రతీకలేనని చెప్పారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఉద్య మాలు ఎగుస్తున్న ఈ తరుణంలో జరిగే బీసీల అలాయ్- బలాయ్ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాయని ఆకాంక్షించా రు. రాజకీయాలకు అతీతంగా ఇలాంటి జా తరలు జరగడం ఆహ్వానించదగిన పరిణామమని పేర్కొన్నారు. ఆటోవాలా నుంచి ఐఏ ఎస్ దాకా, బీఆర్‌ఎస్ నుంచి బీజేపీ  దాకా, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల దాకా, లెఫ్టిస్టు రైటిస్టులతోపాటు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక, ధార్మిక సంఘాలలో ఉన్న బీసీలంతా ఒక్కచోట జమకావడం ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

గం గా జమున తహజీబ్ సంస్కృతిని మరింత గా ప్రతిష్టించడానికి ఈ బీసీ జాతరలు ఎం తో దోహదం చేస్తాయని తెలిపారు. కటకం నర్సింగ్‌రావు మాట్లాడుతూ.. బీసీ జన జాగరణ జాతరను విజయవంతం చేసేందుకు అన్ని రంగాల్లోని బీసీలంతా కుటుంబాలతో సహా కదలి రావాలని కోరారు. మనిషిని మనిషి ప్రేమించే తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బీసీ జన జాగరణ జాతరను నిలబెడతా మని పేర్కొన్నారు.

సబ్బండ కులాల ఐక్యతకు నిదర్శనంగా రాజకీయాలకు అతీతంగా వేలాదిమంది బీసీలు ఈ జాతరలో కలుస్తారని చెప్పారు. లక్షమంది బీసీలకు సోషల్ మీడి యా ద్వారా బీసీ జాతరకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. సబ్బండ కులాల బీసీల జన జాతరకు రాజకీయాలకతీతంగా కదలి రావాలని కోరారు. కార్యక్రమంలో మన ఆలోచన సాధన సమితి ఉపాధ్యక్షుడు నేరెళ్ల దేవేందర్, ప్రచార కార్యదర్శి పెదవుర బ్రహ్మయ్య రజక, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.