30 March, 2026 | 3:27 AM

బీసీలంతా ఏకతాటిపైకి రావాలి

30-03-2026 12:00 AM
  1. స్వయంప్రతిపత్తితో కుల సంఘాలను నిర్వహించాలి

బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు

తమ్మలి కులం పక్కన శూద్ర, నాన్ బ్రాహ్మణ పదం తోలగించాలి

తమ్మలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వటపత్ర సాయి

ఖైరతాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని, చైతన్యంతో అన్ని కులాలను ఏకతాటిపైకి తెచ్చి మన ఓటు మనకే వేసుకుంటే చాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు పేర్కొన్నారు. బీసీ టైమ్స్, బీసీ సమాజ్, తెలంగాణ తమ్మలి సం ఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవి ద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రవ్యాప్తం గా గెలిచిన తమ్మలి సామాజికవర్గ వార్డు సభ్యులందరికీ ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ము ఖ్యఅతిథులుగా బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగెం సూర్యారావు మా ట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన బీసీ సర్పంచ్‌లకు అభినందనలు తెలియజేస్తూ సన్మానిస్తున్నామని, ఇప్పటివరకు ఐదు కులాలను (గంగిరెద్దుల, జోగి, మంగలి, రజక, ఎల్లమ్మల్లవాల్లు) సన్మానించినట్టు చెప్పారు. తమ్మలి కులస్తులు రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటులో తమ్మలి నాయకుల పాత్ర ఎంతో ఉన్నదని చెప్పారు.

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో దాదాపు బీసీ జాబి తాలోని అన్ని కులాలు గ్రామ పాలనలో భాగస్వామ్యాన్ని సాధించాయని పేర్కొన్నా రు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా కాకుండా బీసీ సంఘాలు స్వయం ప్రతి పత్తితో కుల సంఘాలను, కుల సమాజాలను నిర్వహించాలని, అప్పుడే రాజ్యాధికారానికి బీసీలు దగ్గరవుతారని వివరించారు. తమ్మ లి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వటపత్ర సాయి మాట్లాడుతూ.. తమ్మలి కులం పక్కన శూద్ర, నాన్ బ్రాహ్మణ అనే పదాలను తొలగించాలని కోరారు.

రాజకీయ చైతన్యం ఎంతో అవసరం: నిరంజన్

ఈ మధ్యకాలంలో గెలిచిన తమ్మలి కులానికి సంబంధించిన వార్డు సభ్యులందరినీ కలవడం చాలా సంతోషకరమని బీసీ కమిషన్ చైర్మన్ టీ నిరంజన్ పేర్కొన్నారు. బీసీలలో రాజకీయ చైతన్యం ఎంతో అవసరమని, అప్పుడే అనుకున్నది సాధించవచ్చని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా 42 శాతానికిపైగా బీసీలు గెలిచారని చెప్పారు. బీసీల్లో ఏ కులానికి రాజకీయ, ఉద్యోగాల్లో ప్రవేశం లేకుండా ఉన్నారో అటువంటి వారి సమాచారం సేకరిస్తున్నామని, కొన్ని కులాలే ముందుకు పోతున్నాయని వివరించారు.

తమ్మలి కులం పక్కన శూద్ర, నాన్ బ్రాహ్మణ పేర్లు తొలగించడానికి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇచ్చామని, త్వరలోనే క్యాబినెట్ సమావేశంలో దీనికి చట్టబద్ధత వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ గౌరవ అధ్యక్షుడు శివార్చక విజయకుమార్, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లికార్జున్, ఎంబీసీ నాయకులు బడే సాబ్ బాబన్న, రామకృష్ణ, చంద్రమౌళి, విఠల్, వీణధరి, హైమవతి, బడేభాయ్, విఠల్, మానాయ్య తదితరులు పాల్గొన్నారు.