వీసా రెన్యూవల్‌పై అదనపు బాదుడు?
- హెచ్-1బీ, ఎల్1 వీసాలు మరింత ప్రియం
- అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదనలు
వాషింగ్టన్, ఆగస్టు 4: వీసా రెన్యూవల్ ఫీజును భారీగా పెంచేలా ట్రంప్ సర్కార్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే హెచ్-1బీ, ఎల్ 1 వీసాల ఫీజు మరింత భారంగా మారనుందనే అభిప్రాయాలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రకమైన వీసాదారులను నియమించుకున్న సంస్థలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, కార్మికశాఖ, విదేశాంగ శాఖలు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖ ప్రకారం ప్రభుత్వం జారీ చేసే హెచ్ 1 బీ వీసాలు అత్యధికంగా రెన్యువల్స్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. 2025లో 4.06 లక్షల హెచ్ 1బీ వీసాలను ఆమోదించగా అందులో 71 శాతం కేవలం రెన్యువల్స్‌కి సంబంధించినవే కావడం గమనార్హం. వీసాబాండ్ పేరుతో 50 దేశాలపై ఉక్కుపాదం మోపే ఆలోచనలో ట్రంప్ సర్కార్ ఉండగా, అందులో భారత్‌కు మినహాయింపు లభిస్తుందని భావిస్తుందగా, ఈ రెన్యువల్ ప్రతిపాదనలు కాస్త మరోమారు భారతీయుల్లో టెన్షన్ పెంచుతున్నాయి.






