5 August, 2026 | 3:22 AM

18 ఏళ్లకే ప్రొఫెసర్

05-08-2026 12:30 AM
  1.   300 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అమెరికన్ విద్యార్థి
  2. గిన్నిస్ రికార్డులో నమోదు

వాషింగ్టన్, ఆగస్ట్ 4: ప్రపంచంలో అత్యంత చిన్న వయస్సులో ఇంజినీరింగ్ విద్యార్థులకు గణిత ప్రొఫెసర్‌గా అమెరికాకు చెందిన నాథన్ థామస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. పదేళ్ల వయసులోనే కళాశాల చదువు ప్రారంభించిన థామస్ 18 ఏళ్లకే పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగాడు. తన తోటి విద్యార్థులంతా ఇంకా పాఠాలు వినే స్థాయిలో ఉండగా, తాను మాత్రం కృషి, పట్టుదల, తపనతో ఈ స్థాయికి ఎదిగి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

300 ఏళ్ల క్రితం (1717) గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో 19 ఏళ్ల వయసులో ఉన్న స్కాట్లాండ్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త కొలిన్ మెక్లారిన్ ప్రొఫెసర్‌గా ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. అమెరికాలోని మియామీ కాలేజీలో ఇంజినీరింగ్ కాలేజీలో బోధనాధ్యపకుడిగా బాధ్యతలు చేపట్టాడు.

14 ఏళ్ల వయసులో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశాడు. కాగా లా స్కూల్‌లో డిగ్రీ చేస్తున్న తనకు న్యాయ నిపుణుడిని కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, తన తల్లి వల్లే గణితంపై ఆసక్తి పెరిగిందని, తన ఎదుగుదలకు బలమైన పునాది నిర్మించుకోగలిగానని థామస్ చెప్పాడు.