31 August, 2026 | 2:30 AM

ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్‌ను వెనక్కి తీసుకోవాలి

31-08-2026 12:29 AM
  1. విద్యాశాఖ ఉత్తర్వుల్లో శాస్త్రీయత లేదు
  2. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించే సమ్మెటివ్ అసెస్ మెంట్ (ఎస్‌ఏ1), సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ పరీక్షలకు సంబంధించి ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సం ఘం (తపస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ రాజశేఖర్, తెల్క లపల్లి పెంటయ్యలు డిమాండ్ చేశారు. పాఠశాలల్లోని విద్యార్థు ల జవాబు పత్రాల ఎవాల్యుయేషన్ అదే స్కూల్‌లో చేపట్టకుం డా సమీపంలోని వేరే స్కూల్‌లోని టీచర్లతో దిద్దించేలా పాఠశా ల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయే షన్ విధానంతో రూ.10 కోట్ల అద నపు ఖర్చు, విలువైన టీచర్ల బోధనా గంటలు వృథా అయ్యే పరిస్థితి ఉందన్నారు. పాఠశాల విద్యలో విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ), నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) మౌలికసూత్రాలకు విరుద్ధంగా ఎస్‌ఏ 1, ఎస్‌ఏ పరీక్షల ఎక్స్‌టర్నల్ మూల్యాంకనం ప్రవేశపెట్టడా న్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధానకార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి పేర్కొన్నా రు. ఎక్స్‌టర్నల్ మూల్యాంకన నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.