ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠాపన
31-08-2026 12:29 AM
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 30: అబ్దుల్లాపూర్ మెట్ మండల(Abdullapur Met Mandal) పరిధి బలిజగూడ గ్రామం(Balijaguda Village)లో శ్రీ వీరభద్ర స్వామి ఆలయం(Sri Veerabhadra Swamy Temple)లో గత మూడు రోజుల నుంచి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు. మహాగణపతి, సుబ్రహ్మణ్య, నాగదేవతా సహిత, అభయాంజనేయ స్వామి విగ్రహాల ను వేద పండితుల మంత్రోత్సహాలతో విగ్ర హ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవం గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రా మ సర్పంచ్ ఉప్పు మాధవి నవీన్ కుమార్, ఉప సర్పంచ్ ఉప్పు నరేష్, వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచ్లు, దాతలుశివప్రసాద్- విశాల, వినోద్ కుమార్- శైలజ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






