28 February, 2026 | 7:55 PM

కాకినాడలో భారీ పేలుడు.. 21 మంది మృతి

28-02-2026 03:30 PM

అమరావతి: కాకినాడ జిల్లా(Kakinada) వేటపాలెం-జి.మేడపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో 21 మంది మరణించారు. బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి మృతదేహాలు పంట పొలాల్లోకి ఎగిరిపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

బాణసంచా పరిశ్రమలో ఇంకా పేలుళ్లు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల్లో దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు శబ్దాలు విన్న స్థానికులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అడపా నాని కుటుంబ సభ్యులు బాణసంచా పరిశ్రమ నిర్వహిస్తున్నారు. పెదపూడి రోడ్డులోని పొలాల్లో బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ప్రమాద సమయంలో 20 కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక, రక్షణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.