నాలుగు వేల ఈవీఎంలు దగ్ధం
12-06-2026 01:09 AM
ప్రభుత్వ భవనంలో అగ్నిప్రమాదం
పశ్చిమ బంగాల్‌లో ఘటన
కోల్‌కతా, జూన్ ౧౧: ప్రభుత్వ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ౪,౦౦౦ ఈవీఎంలు దగ్ధమైన ఘటన గురువారం పశ్చిమ బంగాల్‌లో చోటుచేసుకుంది. బంగాల్ మంత్రి కౌశిక్ చౌధురీ తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని అలీపుర్ ప్రాంతంలోని ఓ పెద్ద భవన సముదాయంలో బుధవారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ సంభవించింది.
ఫలితంగా అగ్ని కీలలు ఎగసిపడి పక్కనే ఉన్న దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయానికి అంటుకున్నాయి. క్రమంగా మంటలు ఈవీఎంలు భద్రపరిచిన గదికి పాకాయి. దీంతో ఆ గదిలోని సుమారు ౪ వేల ఈవీఎం మిషన్లు కాలిపోయాయి. దగ్ధమైన ఆ ఈవీఎంలను గత అసెంబ్లీ ఎన్నికల్లో ౧౦ నియోజకవర్గాల్లో వినియోగించినట్లు అక్కడి యంత్రాంగం తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.






