1 June, 2026 | 11:53 PM

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

01-06-2026 08:42 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" 99 రోజుల ప్రణాళికలో భాగంగా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామపంచాయతీలో సోమవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పాల్వంచ డివిజన్ తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ, పర్యావరణం, అటవీ, విజ్ఞాన, సాంకేతిక శాఖ సంయుక్తంగా మూకమామిడి శివాలయం ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి, అటవీ అభివృద్ధి సంస్థ డీఎం మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్లాస్టిక్ సేకరణ, మొక్కలునాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గుడి ఆవరణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీశాఖ అధికారులు,సర్పంచ్,గ్రామస్తులతో కలిసి సంచులలో సేకరించారు. అనంతరం గుడి ప్రాంగణంలో మొక్కలు నాటారు. సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ... పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని గ్రామాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ప్లాస్టిక్ నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణంలో ఒక్కొక్క మొక్కను నాటి,ఆ మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.