28 May, 2026 | 2:54 AM

సేవలో ప్రతిఒక్కరూ ముందుండాలి

28-05-2026 01:10 AM

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్

హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ, గోపా ప్రెసిడెంట్ బండి సాయన్న

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): సమాజ సేవలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

బుధవారం రవీంద్ర భారతిలో టీఏంబీఏండబ్యూఏ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులు, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తులను ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించారు. టీఏంబీఏండబ్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎల్. రమణ, గోపా ప్రెసిడెంట్ బండి సాయన్న సినీ, సామాజిక రంగ ప్రముఖులు హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు.

ఈ వేడుకలో మహానంది, గౌతమ బుద్ధ సేవా రత్న, నటరాజ్, మ్యారేజ్ బ్యూరో ఐకాన్, మ్యారేజ్ బ్యూరో రత్న, ఉత్తమ సేవారత్న,  శ్రమశక్తి అవారడ్స్  వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ టీఏంబీఏండబ్యూఏ సేవలను కొనియాడారు. అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలవడం తమ లక్ష్యమని తెలిపారు. సభ్యుల ఐక్యత, సేవాభావం, పరస్పర సహకారంతో సంస్థ మరింత బలోపేతమవుతోందన్నారు.