6 April, 2026 | 3:26 AM

ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ పని చేయాలి

06-04-2026 12:00 AM

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి

వనపర్తి, ఏప్రిల్ 5 ( విజయక్రాంతి ) : రై తుల సంక్షేమం కోసం, దేశ రక్షణ కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహానేత బా బూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆ ధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని  మీటింగ్ హా ల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తో పాటు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులతోపాటు, అధికా రులు, ప్రజాప్రతినిధులు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి ప్రసంగిస్తూ, డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ బాల్యం నుంచే దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. యువ వయస్సులోనే కేంద్ర మంత్రిగా సేవలందించి దేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. గ్రీన్ రివల్యూషన్లో ఆయన పాత్ర కీలకమని, అలాగే రక్షణ మంత్రిగా బంగ్లాదేశ్ విమోచన సమయంలో ఆయన నాయకత్వం ఎంతో గొప్పదని వివరించారు.

ఉప ప్రధాని హో దాలో కూడా దేశానికి విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలం గాణ సాంస్కృతిక సారధి కళాకారులు బాబు జగ్జీవన్ రామ్ జీవితంపై పాడిన గీతా లు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రాంజీరావు, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు గంధం నాగరాజు, చిరంజీవి, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు , కే వెంకటేష్, మాదారి భోజరాజు, గంధం గట్టయ్య, కృష్ణయ్య, కే వెంకట్ గౌడ్, డి వెంకటేష్, విశ్వం బాబు, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కౌన్సిలర్లు, ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్, ఇతర దళిత నాయకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.