నిర్మల్ బస్టాండ్‌లో భద్రత కరవు
కొద్ది నెలలుగా వరుస దొంగతనాలు
చోరీలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
నియంత్రణ చర్యలు కరువు
నిర్మల్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): నిర్మల్ బస్టాండ్ దొంగతనాలకు అడ్డగా మారింది. బస్టాండ్ కేంద్రంగా కొందరు దొంగలు ప్ర యాణికుల బ్యాగులు పర్సనల్ నుంచి విలువై న నగలు బంగారం, నగదు సామాగ్రిని దొంగిలిస్తున్నారు, జనం రద్దీఉంటే చాలు అక్కడ పర్సు లేదా విలువైన వస్తువులు చోరీకి గురి కావాల్సిందే. ఇది ఇప్పుడు కొత్తేమి కాదు, ఆరు నెలల నుంచి ప్రతినెల పదుల సంఖ్యలో చోరీ లు జరుగుతున్న నియంత్రణపై పోలీస్ శాఖ ఆర్టీసీ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
పిల్లాపాపలతో కుటుంబ సభ్యులతో ఆర్టీసీ సురక్షిత ప్రయాణం అని నమ్మి ప్రయాణం చేస్తే విలువైన నగలు నగదు పోగొట్టుకోవాల్సి వస్తుం దని వాపోతున్నారు హాయిగా బస్సు ప్రయా ణం చేద్దామనుకునే వారికి భద్రత కరువైందన్న విమర్శలు వస్తున్నాయి. నిర్మల్ బస్టాండ్ అడ్డాగా మార్చుకొని ఒకే తరహాలో దొంగతనాల జరుగుతున్న వాటిని నియంత్రణపై దృష్టి పెట్టిన దొంగతనాల నియంత్రణ జరగకపోగా మరింత పెరగడం ప్రయాణికులను ఆందోళన గూర్చిస్తుంది.
దొంగతనాలతో జనం బెంబేలు
నిర్మల్ బస్టాండ్‌లో గత నెల రోజుల నుంచి వరుసగా దొంగతనాలు జరగడం ప్రయాణికులను మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉండడం బస్టాండ్లో ప్రతిరోజు ముగ్గురు పోలీస్ సిబ్బంది ఒక ఏఎస్‌ఐ ఎదురు నిర్వహించడం ఆర్టీసీ హోంగార్డు కంట్రోలర్లు పర్యవేక్షణ చేస్తున్న దొంగలు మాత్రం వారికి దొంగతనాలకు పాల్పడుతున్నారు. నిర్మల్ బస్టాండ్ లోని బైంసా, బోత్, ఖానాపూర్, ఆర్మూర్, నిజామాబాద్, లక్ష్మణ్ చందా రోడ్లలో ఈ దొంగతనాలు జరుగుతున్నట్టు ప్రయాణికులు చెప్తున్నారు, టీజీ ఆర్టీసీ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న నేపథ్యంలో అన్ని ప్రధాన రూట్లో మహిళల రద్దీ విపరీతంగా ఉంది.
నిర్మల్ ఆర్మూర్ ఖానాపూర్ ఆదిలాబాద్ బోత్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిరోజు ప్రనికులు నిర్మల్ వస్తూ పోతుంటున్నారు. వీరంతా ఆరోగ్య అవసరాలు పిల్లల చదువులు, వ్యాపార దుకాణంలో పనిచేయడం, షాపింగ్ కోసం, తమ పిల్లలను స్కూల్లో కలిసేందుకు, పెండ్లిలు పేరంటాలు శుభకార్యాలు, ఇలా పెద్ద ఎత్తున నిర్మల్ రాకపోకలు సాగిస్తారు, ఉదయం సాయంత్రం వేళలో నాలుగు నుంచి ఏడు వరకు కానాపూర్ నిజామాబాద్ మంచిర్యాల్ బైంస, బోత్ తదితర రూట్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సులు తక్కువగా ఉండటం, వచ్చిన బస్సుల కోసం జనాలు ఎగబడడం సీట్ల కోసం పోటీ పోవడం జరగడంతో అదే సందర్భంలో ఈ చోరీలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. గత వారం రోజుల్లోనే బస్టాండ్ లో 8 చోరీలు జరిగినట్టు స్థానికులు తెలిపారు.
నాలుగు రోజుల క్రితం నిజాంబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడు నదుల బంగారం పోగొట్టుకోగా, దిల్ వరకు చెందిన కండక్టర్ పర్సు చూరి కి గురి అయింది. బైంసా పట్టణం చెందిన ఓ వ్యక్తి పర్సు చోరీకి గురి అయింది. తురాటి కుబీర్ కుంటాల చెందిన వ్యక్తులకు చెందిన పర్సులు చోరీకి గురికాగా లక్ష్మణ్ చెందకు చెందిన ఓ మహిళ బట్టలు చోరీకి గురయ్యాయి. బస్సు కండక్టర్లు డ్రైవర్లు పోలీసులు ప్రయాణికులను దొంగతనం పట్ల అప్రమత్తం చేస్తున్నారు. దొంగలు ఉంటారు జాగ్రత్త అని చెప్తున్న ఈ చోరీలు మాత్రం ఆగడం లేదు. కొందరు మహిళలు చిన్నపిల్లలు ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు చెప్తున్నారు.
అయితే బస్సు ఎక్కి ప్రయాణికుల పర్సులు కొట్టివేయడం వల్ల బస్సు కిరాయికి పైసలు లేక బస్సులో ప్రముఖులను అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బైసాకు చెందిన ఒక ఫ్యామిలీ పర్స్ పోవడంతో బస్సు కిరాయి కోసం బస్సులో చందాలు తీసుకోవాల్సి వచ్చింది. ఫోన్లు కూడా సూరికి గురవుతున్నాయి. కుంటలకు చెందిన ఓ టీచర్ ఫోన్ సూరికి గురైంది. ఆయన అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లవలసి రావడంతో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లే పరిస్థితి లేకపోయిందని వాపోయారు. ఇదంతా ప్రతినెల జరుగుతున్న దొంగతనాలు నేతలకు పోలీస్ శాఖ చర్యలు చీపడుతున్న నియంత్రణ మాత్రం జరగకపోవడం ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తుంది.
ఆర్టీసీ వారు ఆలోచించాల్సిందే..
ప్రనికుల సేవ ప్రథమ కర్తవ్యం అంటూ గొప్పలు చెబుతున్న టీజీ ఆర్టిసి దొంగతనాలకు బాధ్యత వహించాల్సిందేనని చెప్తున్నారు. బస్టాండ్లో ఇలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం. పదే పదే ఒకే రూట్ బస్సుల్లో ఒకే తరహా దొంగతనాలు జరుగుతున్న ఆ రూట్లో రద్దీ ఉన్నప్పుడు బస్సులు నడపకపోవడమే ప్రధాన కారణమని చెప్తున్నారు. ముఖ్యంగా ఖానాపూర్ బైంసా రూట్లో ఎక్కువ రద్దీ ఉన్న నడిచే బస్సులో టైం బాండ్ పాటించడం లే దు. ఒకేసారి మూడు నాలుగు బస్సులు వెళ్తున్నాయని ఆ తర్వాత అరగంట గంట బస్సులు లేకపోగా రద్దీ ఎక్కువ దొంగతనాలకు ఆస్కా రం ఏర్పడుతుందని ప్రజలు ఆర్టీసీ అధికారులపై మండిపడుతున్నారు.
దొంగతనాలు జరిగినప్పుడు బస్టాండ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి దొంగతనాల ఫుటేజీలు బయటపెడుతున్న దొంగలను మాత్రం పట్టుకోవడంలో విఫలం అవుతున్నారు. బస్టాండ్‌లో ఆటోలు ప్రైవేట్, మందుబాబు లు, బిచ్చగాళ్లు, పెద్ద ఎత్తున న్యూసెన్స్ చేస్తున్నారు, బస్టాండ్ లోకి ఆటోలు విచ్చలవిడిగా ప్రవేశించడంతో ఆటోలో ఎవరు వస్తున్నది ఎవరు వెళ్తున్నదో తెలియని దుస్థితి నెలకుంది, బస్టాండ్ లోనికి ఆటోలకు అనుమతి లేకున్నా లోనికి రావడంపై ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, ఇప్పటికైనా అధికారులు ఈ దొంగ తనాలు నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్మల్ ప్రయాణికులు కోరుతున్నారు.




