6 April, 2026 | 5:01 AM

అర్హత లేకున్నా అందలం..

06-04-2026 02:57 AM

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కి నోడల్ అఫిసర్ హోదా

కరీంనగర్, ఏప్రిల్5(విజయక్రాంతి):కరీంనగర్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కుకునూరు స్వామి( ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ) కానీ ఇతను ఒక ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగిగా చలామణి అ వుతున్నాడు. కార్పొరేషన్ లో ప్రజా పాలన ప్రోగ్రాంలో నోడల్ ఆఫీసర్ గా నియమిస్తూ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేయడమే కాదు, ఉత్తర్వులో మొదటి పేరు ఈ స్వామి డే.. ఇంటి పన్ను వసూళ్లలో వారెంట్ ఆఫీసర్ గా ప్రజా పాలన ప్రగతి నివేదిక ప్రోగ్రాంలో స్పెషల్ ఆఫీసర్ గా మున్సిపల్ ఆఫీసు నుం డి ఇతని పేరుపై ఆర్డర్ కాపీ విడుదల అ య్యింది.

ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై ఇంత ప్రేమ ఎందుకో అర్థం కావడం లేదు. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు మున్సిపల్ ఆఫీసులో సూపరిండెంట్ స్థాయి అధికారులు చాలామంది ఉన్నారు అయినా కానీ కుకునూరు స్వామి ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కు ఇంత పెద్ద పదవులు ఇవ్వడం వెనుక ఎవరున్నారు.

అన్న చర్చ నడుస్తోంది. ఆ పదవులతో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ స్వా మి తనకు ఇష్టం వచ్చినట్టుగా అందరిపై పెత్త నం చెలాయిస్తున్నాడని ఉద్యోగులు వాపోతున్నారు. అతనికి డ్యూటీ వేసే క్రమంలో ఆర్డర్ కాపీలలో ఎక్కడా కూడా అతడు ఔ ట్సోర్సింగ్ ఉద్యోగి అని రాయడం లేదు కానీ అతడు ఈ ఆర్డర్ కాపీలను కోర్టులో వేసుకుని రెగ్యులర్ చేయమని దావా వేస్తానని కొందరితో చెప్పుకుంటున్నాడు. 

పాలకవర్గ సమావేశంలో నూ చర్చ : తాజాగా జరిగిన పాలకవర్గ సమా వేశంలో స్వామి

 వ్యవ హారం ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. సాధారణ ఉద్యోగిగా వ చ్చి, కార్పొరేషన్ను తన సొంత సామ్రాజ్యం లా మార్చుకున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న పని చేసినా భారీ గా బిల్లులు పెట్టడం, పది ఫ్లెక్సీలు ప్రింట్ వేయించి 66డివిజన్లకు వేసినట్లు చూపించ డం వంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఎన్విరాల్మెంట్ ఇంజనీర్లకు సగటు జీతం రు 33,000 ఉండగా, స్వామి మాత్రం నెలకు రూ.50, 000 జీతం వరకు తీసుకుంటు న్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఒక పోస్టుకు ఇద్దరు ఇంజనీర్లను పెట్టి కార్పొరేషన్ నిధులను దోచుకుంటు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్వచ్ఛ ఆటో కార్మికుల నుండి రూ. 10,000 నుంచి రూ.15,000 వరకు లంచా లు వసూలు చేయడం, డీఆర్ సీసీ పనులు బంధువు లకు కట్టబెట్టడం, కార్మికులను బెదిరించడం వంటి ఆరో పణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ‘స్వచ్ఛ సర్వేక్షన్‘ పేరిట ప్రతి సంవ త్సరం టెండర్ లేకుండానే బినామీ సంస్థల ద్వారా సుమారు రూ. 20 లక్షలు డ్రా చేస్తున్నాడని సమాచారం. గత 10 నుండి 15 ఏళ్లలో ఇదికోటిన్నర దాటిందాఅన్న అనుమానం వ్యక్తమవుతోంది.