వివాదాస్పదమైన సర్టిఫికెట్ జారీ
- ఒక రోజున దరఖాస్తు, ఆర్ ఐ విచారణ, సర్టిఫికెట్ జారీ
బోయినపల్లి తాసిల్దార్ ఆర్ ఐ పైన చర్యలు తప్పవా?
కరీంనగర్: ఏప్రిల్ 5(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో రామాలయం కు సంబంధించిన భూమి ఆలయ నిర్వహణ విషయంలో తాసిల్దార్ నారాయణరెడ్డి కాంగ్రెస్ నేత కూస రవీందర్ కు జారీ చేసిన సర్టిఫికెట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివాహస్పద మైనది. భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ కోసం ఎంతోమంది బాధితులు తాసిల్దార్ కార్యాల యంలో దరఖాస్తు చేసుకొని రోజులు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయిన విచారణ చేయాల్సిన ఆర్ ఐ లు విచారణ చేయరు.రసర్టిఫికెట్లు కూడా జారీ చేయరు.
ఎంతోమంది బాధితులు ఈ విషయంలో కార్యాల యం తిరుగుతున్నారు. కొందరైతే భూముల విషయంలో ఏళ్ల తరబడిగా తిరుగుతున్న పరిష్కారం కాలేదు. కానీ ఇక్కడ ఒక కాంగ్రెస్ నేత ఒకేరోజు దరఖాస్తు చేసుకోగా దరఖాస్తు చేసుకున్న రోజుననే విచారణ జరిపి సర్టిఫికెట్ అందించి కాంగ్రెస్ నేతల మన్ననలను రెవెన్యూ అధికారులు పొందారు. ఈ విషయమై బయటకు రాగా వెంటనే ఆ గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ గ్రామస్తులతో కలిసి శనివారం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు. రామాలయం కు సంబంధించి సర్పంచి ఎవరు ఉంటే వారు శ్రీరామనవమి రోజున కళ్యాణ వేడుకలు జరపడం ఆనవాయితీ.
కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ నేతల మన్ననలు పొందెందుకు, వారిని మచ్చిక చేసుకునేందుకు రామాలయం కు సంబంధించిన వాటికి హక్కు దారుగ సర్టిఫికెట్ అందించారు. ఈ విషయంలో ఆ గ్రామ సర్పంచ్ ఇది ఎక్కడి సంస్కృతి ఆచారం ఇది నిబంధనలకు విరుద్ధమని గ్రామస్తులతో కలిసి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ ఆర్డిఓ రాధాబాయి కూడా తాసిల్దారు ను కాంగ్రెస్ నేత పూస రవీందర్ పెట్టుకున్న అర్జీ కాపీని అందించాలని ఆదేశాలు ఇవ్వగా సదరు తాసిల్దార్ ఆర్డీవోకు పంపినట్టు తెలిసింది.
అంతే కాకుండా కాంగ్రెస్ నేతల కొందరు తాసిల్దార్ కార్యాలయం వెళ్లి సర్టిఫికెట్ ఎలా జారీ చేశారని ఇది నిబంధన విరుద్ధమని చెప్పగా తాసిల్దార్ సైతం కొంత డైలమాలో పడి మిస్టేక్ జరిగిందని మాట్లాడినట్లు విశ్వాసం నీయ సమాచారం. ఈ విషయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా హార్ట్ టాపిక్ గా గా మారి ప్రజలు అధికారులు చర్చించుకుంటున్నారు. కొందరు సీనియర్ రెవెన్యూ అధికారులు బోయినపల్లి రెవెన్యూ అధికారుల ది తప్పుగా అంటున్నారు. ఎందుకంటే కనీసం వారం నుంచి 15 రోజుల్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి సర్టిఫికెట్ జారీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఏదైనా దరఖాస్తు వస్తే సమగ్ర విచారణ జరిపి రెవెన్యూ అధికారులు ఈ విధంగా చేయడం ఏమిటని అనుకున్న వారి ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు. జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన తాసిల్దార్ ఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్, గ్రామస్తులు ఒక ప్రకటనలో కోరారు.




