దేశానికే ఆదర్శం.. హైకోర్టు భవనం
- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
అన్నివర్గాల ప్రజలకు త్వరగా న్యాయం అందించడమే
లక్ష్యం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హైకోర్టు జోన్ -
భవన సముదాయానికి శంకుస్థాపన
రంగారెడ్డి, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): తెలంగాణ న్యాయవ్యవస్థ చరి త్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రన గర్‌లో రాష్ట్ర హైకోర్టు జోన్- భవన సముదాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఆదివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్‌వీ భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పీఎస్ నరసింహలతో పాటుతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్‌రెడ్డి పాల్గొన్నారు.
అత్యుత్తమ హైకోర్టుగా నిలుస్తుంది: సీజేఐ
శంకుస్థాపన అనంతరం హైకోర్టు భవన నమూనాను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఈ ప్రాం గణం దేశంలోనే మోడల్‌గా నిలవబోతోందని ప్రశంసించారు. కోర్టు గదులు, పరి పాలనా విభాగాలు, నివాస గృహాలు, శిక్షణా కేంద్రాలు అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండటం విశేషం అని కొనియాడారు. న్యాయవ్యవస్థ తన సొంత నిబంధనల ప్రకారం పనిచేసేందుకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం అన్నారు.
జిల్లా న్యాయవ్యవస్థ కోసం ఇక్కడ నిర్మించే ఆడిటోరియం, శిక్షణా కార్యక్రమాలు న్యాయ విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని, మూడు అంతస్తుల్లో నిర్మించే సెంట్రల్ రికార్డ్ రూమ్ న్యాయపరమైన తీర్పుల స్థిరత్వానికి పునాదిగా మారు తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 100 ఎకరాల భూమిని, రూ.2,500 కోట్లకు పైగా నిధులను మం జూరు చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయ న అభినందించారు.
సామాన్యుడి చివరి ఆశ్రయం న్యాయ దేవాలయం: సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు త్వరితగతిన న్యాయం అం దించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ నిర్మాణా న్ని చేపట్టినట్లు సీఎం వెల్లడించారు. జోన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయని, జోన్ (నివాస సముదాయం) పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు.
న్యాయమూర్తుల తీర్పులకే కా కుండా, వారి అభిప్రాయాలకు కూడా తమ ప్రభుత్వం అత్యున్నత విలువనిస్తుందని పునరుద్ఘాటించారు. కేవలం హైకోర్టు మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మరో 49 కోర్టుల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని సీఎం వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సెక్రెటరీ వికాస్ రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, కలెక్టర్ సీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రాములు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.




