అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి
బోథ్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో దరఖాస్తులను సమర్పించుకోవాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకోవాలన్నారు ఈ సందర్భంగా బిఎల్వోలు నిర్వహించిన ఫైళ్లను పరిశీలించారు.
ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలను వారికి కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో తాసిల్దార్ సుభాష్ చంద్ర ఎంపీడీవో రమేష్ లు మాట్లాడుతూ బాధ్యతగా పనులను పూర్తి చేయాలన్నారు రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే గుర్తించి తగు న్యాయం చేయాలన్నారు.
ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి సర్పంచ్ మండల అధ్యక్షులు ఓరుగంటి స్వామి మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ సర్పంచులు రవీందర్ బాబులాల్ వీడీసీ చైర్మన్ పోతన్న ఆత్మ మాజీ చైర్మన్ మల్లెపూల సుభాష్ మండల పార్టీ కన్వీనర్ ఎలుక రాజు గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ రమణ గౌడ్ పట్టణ అధ్యక్షుడు అల్లకుండా ప్రశాంత్ రఫీ సంజీవ్ బాపురెడ్డి వినయ్ ఇత్యకారు గోపాల్ సందీప్ ఉపసర్పంచ్ మామిడి సంతోష్ తదితరులు ఉన్నారు






