14 July, 2026 | 4:21 PM

Breaking News

పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

14-07-2026 03:31 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఆషాడమాసం శాకంభరీ ఉత్సవాలలో భాగంగా  అమావాస్యను పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్‌ రూరల్ మండలం నగునూర్‌లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో దుర్గాభవానీ అమ్మవారికి ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ ఫలపంచామృతాభిషేకం, విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం శాకంభరీ ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తు ద్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులు పాల్గొన్నారు.