13 June, 2026 | 1:44 AM

యూరప్ ద్వంద్వనీతి

13-06-2026 12:47 AM
  1. భారత్‌తో స్నేహమంటూనే.. టార్గెట్ చేస్తున్నాయి
  2. మీరమ్మిన ఆయుధాలతోనే ఇండియాపై దాడులు
  3. మేము రష్యా నుంచి చమురు కొనకూడదా?
  4. మా జాతీయ ప్రయోజనాలే కలకమన్న కేంద్రమంత్రి జైశంకర్   

న్యూఢిల్లీ, జూన్ 12 (విజయక్రాంతి): యూరప్ ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నాయని, భారత్‌తో స్నేహమంటూనే.. ఆ దేశాలు టార్గెట్ చేస్తున్నాయని కేంద్రవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడంపై ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చారు. భారత దేశ ప్రయోజనాలే తమ నిర్ణయాలకు ప్రాతిపదిక అని స్పష్టం చేశారు. ‘మీరమ్మిన ఆయుధాలతోనే కొన్ని దేశాలు ఇండియాపై దాడులు చేశాయని ఆరోపించారు.

తాము రష్యా నుంచి చమురు కొనకూ డదా? అని కేమంద్రమంత్రి జైశంకర్ ప్రశ్నించారు. అలాగే ఐరోపా దేశాల ఆయుధ సరఫ రా విషయంలో భారత్‌కు ఉన్న భద్రతాపరమైన ముప్పును ఆయన పునరుద్ఘాటిం చారు. ఫిన్‌లాండ్‌లో జరిగిన ‘ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది న్యూస్ జియోపాలిటికల్ కాంపిటీషన్’ కార్యక్రమంలో జైశంకర్ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి రష్యాతో భారత్ మరీ సానుకూలంగా వ్యవహరిస్తోందని, ఆ దేశ చమురుపై అతిగా ఆధారపడుతోందని ఈ చర్చలో మంత్రికి ప్రశ్న ఎదురైంది. దీంతో బదులిస్తూ.. రష్యా చమురు కొంటున్నందుకు తమను ప్రశ్నిస్తోన్న యూరప్ దేశాలే.. భారత్ ప్రత్యర్థులకు ఆయుధాలను విక్రయించిన విషయాన్ని గుర్తుచే శారు.

ఆ ఆయుధాలు గతంలో భారత్‌పైదాడులకు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. ఇప్పుడేకాదు.. కొన్నేళ్లుగా అలా జరుగుతోంది. ఐరోపాను ప్రమాదంలో పడేసే పని ఏదీ భారతీయులు చేయలేదు.. అని పేర్కొన్నారు. రష్యా చమురు విషయంలో భారత విధానంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘జాతీయ ప్రయోజనాలు, ధర, లభ్యత ఆధారంగా చమురు కొనుగోలు చేస్తామని, ఆ విధంగా చూసుకుంటే.. అప్పుడు మార్కెట్లో లభించే చమురు లో అధికభాగం రష్యాకు చెందినదేనని అన్నా రు.

పక్షపాత ధోరణితో వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. సంప్రదాయ సరఫరాదారులైన మిడిల్‌ఈస్ట్ నుంచి ఐరోపా దేశాలు చమురు కొనుగోలు చేయడం వల్లే, భారత్ రష్యా వైపు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు. మా జాతీయ ప్రయోజనాల ప్రకార మే భారత ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో ప్రపంచ మార్కెట్‌లను స్థిరీకరించడానికి, ఇంధన ధరలను అదుపులో ఉంచడానికి రష్యా చమురు కొనాలని 2022లో అమెరికానే స్వయంగా భారత్ ను కోరిందని వెల్లడించారు. ఆ తర్వాత ఆంక్ష లు విధించి మళ్లీ ఎత్తివేయడం వారి సొంత ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.