మండల కేంద్రంలో నూతన బ్యాంకు ఏర్పాటు
ఎల్లారెడ్డి పేట జూలై 23,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభోత్సవం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న మరియు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన మరియు విశ్వసనీయ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు గాయత్రి బ్యాంక్ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభమైన ఆర్థిక సేవలు, పొదుపు అలవాట్ల పెంపు, వ్యాపారాభివృద్ధికి అవసరమైన రుణ సదుపాయాలు కల్పించడంలో గాయత్రి బ్యాంక్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. బ్యాంక్ మరింత అభివృద్ధి చెందుతూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ, సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సర్పంచ్ ఎనుగందుల నర్సింలు, ఉప సర్పంచ్ బందారపు బాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, బ్యాంకు యాజమాన్యం, వ్యాపారులు మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






