బాన్సువాడలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
బాన్సువాడ, జూలై 23 (విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావును అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ముసుగులో కాక్రోచ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు దేశంలో అల్లరు సృష్టించేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. ఢిల్లీలో జరిగిన సంఘటన దేశ విగ్రహ శక్తులు విద్యార్థుల ర్యాలీలో చొరబడి విధ్వంసం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం తిప్పి కొట్టిందన్నారు. బంగ్లాదేశ్ , పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలలో యువత మోసపోవద్దని, దీనివల్ల భవిష్యత్తు అందాకారమవుతుందన్నరు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్ బిజెపి కౌన్సిలర్స్ గజ్జల మహేష్ ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు శ్రీనివాస్ లక్ష్మీనారాయణ సుధాకర్ గౌడ్ మోహన్ రెడ్డి చీకట్ల రాజు పాశం భాస్కర్ రెడ్డి శ్యామల శ్రీకాంత్ కొండని గంగారం సాయిబాబా నాగరాజు సిద్ది బాలరాజ్ మహేందర్ ప్రదీప్ పురుషోత్తం పద్మ నరేష్ రామకృష్ణ భూమేష్ అశ్విన్ సంతోష్ సాయి ప్రసాద్ లక్ష్మణ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.






