16 April, 2026 | 7:18 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

16-04-2026 04:23 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): క్షయ వ్యాధి నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య అన్నారు.గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిక్షయి శిబిర్ (క్షయ వ్యాధి ) కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా  డాక్టర్ వి నరేష్ మాట్లాడుతూ నిక్షయ్ శిబిర్ ప్రచారం అనేది భారతదేశాన్ని క్షయ రహిత దేశంగా మార్చే లక్ష్యం వేగవంతం చేయటానికి నిర్వహించే 100 రోజుల కార్యక్రమం అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా సామూహికంగా క్షయనిర్ధారణ కొరకు స్పూటం పరీక్షలు, ఎక్సరే పరీక్ష సైట్ టీవీ ఇంజక్షన్ వేయడం జరుగుతుందని,ఈ యొక్కసైట్ టీవీ ఇంజక్షన్ ద్వారా వ్యక్తికి బ్యాక్టీరియా ఉన్నదా లేదా నిర్ధారించడం జరుగుతున్నది, X Ray పాజిటివ్ ఉంటే టిబి మందులు మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితముగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాగేశ్వరరావు, డాక్టర్ సంతోష్,సుష్మ, అశోక్ ,సిహెచ్ఓ తీగల నరసింహ,సూపర్వైజర్ అంజయ్య గౌడ్,వెంకటరమణ,స్టాఫ్ నర్స్ యశోద,ఏఎన్ఎం కవిత,అంజలి, పాల్గొన్నారు