17 August, 2026 | 5:05 AM

పాక్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్

17-08-2026 01:52 AM

ఆమ్స్టెల్వీన్, ఆగస్టు 16 : పురుషుల హాకీ ప్రపంచ కప్‌ను పాకిస్తాన్ ఓటమితో మొదలు పెట్టింది.ఇంగ్లాండ్తో జరిగిన  మ్యాచ్‌లో పా కిస్థాన్ పరాజయం పాలైంది. నెదర్లాండ్స్ లో ఆమ్‌స్టెల్విన్‌లోని వాగ్నర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 12వ నిమిషంలో స్టువర్ట్ రష్మేయర్ ఇంగ్లండ్కు ఆధిక్యా న్ని అందించాడు. 28వ నిమిషంలో శా మ్యూల్ వార్డ్, 31వ నిమిషంలో సామ్ హూ పర్, 47వ నిమిషంలో జేమ్స్ ఆల్బరీ గోల్స్ చేశారు.

50వ నిమిషంలో అఫ్రాజ్ ఈ మ్యా చ్‌లో పాకిస్థాన్ తరఫున ఏకైక గోల్ చేశాడు. హాకీ ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్థాన్ అత్యం త విజయవంతమైన దేశంగా నిలిచింది. 1971లో ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థా న్ రికార్డు స్థాయిలో 4 సార్లు హాకీ ప్రపంచ కప్ను గెలుచుకుంది.

తొలి ప్రపంచ కప్‌ను కూ డా పాకిస్థాన్ గెలుచుకుంది. అయితే భారతదేశంలో జరిగిన 2023 ప్రపంచ కప్కు ఆ జట్టు అర్హత సాధించలేదు.ఈ హాకీ ప్రపం చ కప్‌లో భారత్, పాకిస్తాన్ కూడా పోటీపడనున్నాయి. ఈ రెండు జట్లు ఆగస్టు 19న తలపడనున్నాయి. అంతకు ముందు, ఆగస్టు 17న భారత్ ఇంగ్లాండ్‌తో తలపడనుండగా.. పాకిస్థాన్ వేల్స్‌తో తలపడుతుంది.