8 July, 2026 | 7:08 PM

ఈనెల 24వ తేదీలోగా ఏనుమ్యారేషన్ ఫామ్స్ అందించాలి

08-07-2026 05:48 PM

* ఖానాపూర్ నియోజకవర్గం ఏఆర్ఓ మోహన్ సింగ్ 

ఉట్నూర్,(విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ని రెండు లక్షల 30 వేల ఒక 162 ఓటర్లకు ఏనుమ్యారేషిన్ ఫారాలు అందజేయడం జరిగిందని ఉట్నూర్ ఆర్డీవో, ఖానాపూర్ నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ రాథోడ్ మోహన్ సింగ్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని  వివిధ రాజకీయ పార్టీ నాయకులతో  ఉట్నూర్ ఆర్డీవో కార్యాలయంలో  ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో సర్ కార్యక్రమంపై రాజకీయ నాయకులకు పూర్తి వివరాలతో వివరించారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో  27,435  ఓటర్లకు అనుసంధానం చేశామని, మిగతా ఫారాలు బి ఎల్ ఓ లకు అందగానే వాటిని అనుసంధానం చేస్తామని  రాజకీయ నాయకులకు వివరించారు. సర్ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని  ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచనలు చేశారు.