అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి
పాపన్నపేట: పాపన్నపేట మండలం పాత లింగాయిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, చీకోడ్ పీఏసీఎస్ చైర్మన్ సిద్ధంశెట్టి దత్తు తండ్రి సంగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం పాత లింగాయిపల్లి గ్రామానికి చేరుకుని సంగయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటని పేర్కొంటూ, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరి వెంట పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కొత్తపల్లి జగన్, పాపన్నపేట పిఎసిఎస్ చైర్మన్ మల్లేశం, రామతీర్థం సర్పంచ్ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గురుమూర్తి గౌడ్, నవీన్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సొంగ దుర్గయ్య, వెంకటేశం, బాబా గౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు.






