8 July, 2026 | 7:52 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

బిఎల్వోలు బాధ్యతాయుతంగా పనిచేయాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి

08-07-2026 06:33 PM

బోథ్,(విజయక్రాంతి): బిఎల్వోలు బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో ఎస్ ఐ ఆర్ ను పూర్తి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందం పేర్కొన్నారు. బుధవారం బోత్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో డోర్ టు డోర్ సర్వే ప్రగతి పై బిఎల్ఓ లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఓటు హక్కును కల్పించాలన్న సంకల్పంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల తహసిల్దార్లతోపాటు సూపర్వైజర్లు భూతస్థాయి అధికారులతో సమావేశమై ప్రగతిపై పరిశీలించడం జరిగింది. అత్యంత కీలకమైన ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించడమే ఈ ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ ఐ ఆర్ ముఖ్య ఉద్దేశం అన్నారు.

బాధ్యతాయుతంగా పనిచేయకపోతే చర్యలు తప్పవని గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.ఎస్ఐఆర్ సర్టిఫికెట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఆఫ్లైన్లో రికార్డు పక్కాగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా నుండి మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను చట్టబద్ధమైన నిబంధన ప్రకారం తొలగించాలని, అర్హులైన. ఓటర్ల ను జాబితాలో చేర్చాలన్నారు. ఫారం 6 సేకరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా హోటల్ సమర్పించి ఎన్యుమరేషన్ ఫారాలను నిరంతరం పర్యవేక్షిస్తూ తుది జాబితా రూపకల్పనకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.సమీక్ష సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పాలు మండలాల రెవెన్యూ అధికారులు సూపర్వైజర్లు బిఎల్వోలు పాల్గొన్నారు.