24వ తేదీలోగా ఎన్యుమరేషన్ ఫారములు అందజేయాలి
04-07-2026 04:21 PM
* గ్రామపంచాయతీలో తహసిల్దార్ అవగాహన
ఉట్నూర్,(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిన సర్ కార్యక్రమంలో ఓటర్ల కు ఎన్యుమరేషన్ ఫారంలో అందజేయడం పూర్తి అయిందని తహసిల్దారులు ప్రవీణ్ కుమార్, రఘునాథరావులు అన్నారు. శనివారం ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల పరిధిలోని ఆయా గ్రామపంచాయతీలో యువతతో పాటు సర్పంచులకు, వివిధ పార్టీ నాయకులకు సర్ కార్యక్రమంపై మరోసారి అవగాహన కల్పించారు.
ఓటర్లకు అందజేసిన ఫారంలను ఈనెల 24వ బిఎల్ఓలకు అందచేయాలని అన్నారు. ఈనెల 24వ తేదీలోగా అందజేసిన ఫారంలను పరిశీలించి ఈనెల 31న ప్రచురించే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు అవుతాయని అన్నారు. ఈ విషయంపై ఓటర్లకు ప్రతి ఒక్కరు అవగాహన కల్పించాలని సూచనలు చేశారు.






