రైతులు అధిక దిగుబడులకు ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయాలి
04-07-2026 04:23 PM
బోథ్(విజయక్రాంతి): రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని చేసుకొని అధిక దిగుబడులు పొందాలని బూత్ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుడాల అనిష్ కోరారు శనివారం సోనాల మండల కేంద్రంలోని రైతు వేదికలో కపాస్ క్రాంతి పథకం కింద మంజూరైన ఉచిత సబ్సిడీ విత్తనాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి పంట సాగు చేయాలని కోరారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగాల భోజన్న మండల వ్యవసాయ అధికారి దేవ నాయక్ పలువు రైతులు పాల్గొన్నారు






