ఇళ్లస్థలాల కోసం ఎమ్మెల్యేకు పాత్రికేయుల వినతి పత్రం
04-07-2026 05:07 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు కోరుతూ నఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికీ TSJU సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. శనివారం ఎమ్మెల్యే నివాస భవనంలో ఎమ్మెల్యేలు కలిసిన సంఘం నాయకులు జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాల్సిందిగ విన్నవించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో TSJU జిల్లా అధ్యక్షుడు రమేష్ శర్మ, ఉపాధ్యక్షుడు సురేష్, ప్రధాన కార్యదర్శి రాహుల్ గౌడ్, కోశాధికారి భీమేష్ తోబాటు నిర్మల్ లక్ష్మణ చందా సభ్యులు పాల్గొన్నారు






