4 July, 2026 | 6:21 PM

దేశాయిపేట్ గ్రామపంచాయతీ ముందు గ్రామస్తుల నిరసన

04-07-2026 05:14 PM

తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల డిమాండ్

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామపంచాయతీలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా లేక ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కాలి బిందెలు బకెట్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు.

డబుల్ బెడ్ రూమ్ కాలనీలో బోరు మోటర్ చెడిపోయి ఇటు మిషన్ భగీరథ నీరు రాక కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని త్రాగడానికి నీరు లేక ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. వార్డ్ మెంబర్, గ్రామపంచాయతీ సిబ్బంది పట్టించుకోవడంలేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు.ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి గీతను గ్రామస్తులు అడగగా తాగునీటి సమస్య పరిష్కరిస్తానని బోరు మోటర్ రిపేర్ చేయించి కాలనీలో తాగునీటిని సరఫరా చేసే విధంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. రెండు రోజులపాటు మిషన్ భగీరథ నీరు సరఫరాకు అంతరాయం ఉందని ప్రజలు గమనించాలని ఆమె సూచించారు.