బోధన్ సబ్ స్టేషన్ ని తనిఖీ చేసిన వరంగల్ సీఎండి
04-07-2026 05:32 PM
బోధన్(విజయక్రాంతి): బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ టౌన్ 1 సెక్షన్ కార్యాలయంలో వరంగల్ సి,ఎం,డి, కర్నాటి వరుణ్ రెడ్డి, బోధన్ సబ్ స్టేషన్, బోధన్ డివిజన్ కార్యాలయం ఎలక్ట్రిసిటీ రెవిన్యూ కార్యాలయం లను తనిఖీ చేశారు. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి కృషీ చేయాలని, వినియోగదారుల పిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా వినియోగదారులకు అవగాహనా కల్పించాలని, అలాగే సిబ్బంది కూడా విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా సేఫ్టీ పరికరాలు, ఎర్త్ రాడ్ లు, చేతి గ్లౌజ్ లు, టెస్టర్ లు తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు. అలాగే బోధన్ డివిజన్ పరిధిలో ల పని చేస్తున్న అధికారులు, సిబ్బంది వినియోగదారులకు మంచిగా సేవలను అందిస్తున్నారని ప్రశoశించారు.






