పంట మార్పిడితో రైతులకు ప్రయోజనం
04-07-2026 05:36 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు పంట మార్పిడి పద్ధతులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాదు రైతుల పంట మార్పిడి పద్ధతులు, ఆయిల్ ఫాం సాగు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై పలు సూచనలు చేశారని వివరించారు.
నిర్మల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. రైతులు ఆహార పంటలు పప్పు దినుసుల పంటలు వేసుకోవాలని ఇందులో ఆయిల్ రైతులకు లాభాలను ఇస్తుందని వివరించారు.






