గచ్చిబౌలి కొండాపూర్ రహదారి ఆక్రమణల తొలగింపు
04-07-2026 05:04 PM
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): గచ్చిబౌలి కొండాపూర్ ప్రధాన రహదారిపై ఏళ్లుగా పేరుకుపోయిన ఆక్రమణలను హైడ్రా, జిహెచ్ఎంసి అధికారులు శనివారం తొలగించారు. బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్‌బండ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, షెడ్లు, ఫుట్‌పాత్ ఆక్రమణలను ఉదయం 4 గంటల నుంచి జేసీబీల సాయంతో కూల్చివేశారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగిన ఈ తొలగింపు పనుల కారణంగా రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయినప్పటికీ స్థానికులు రహదారి విశాలంగా మారడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రహదారుల అక్రమ అక్రమణాలపై ఎవరినీ ఉపేక్షించేది లేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.






