2 September, 2026 | 11:24 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

04-07-2026 | 05:34pm

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని నర్సాపూర్ గేట్ వద్ద కల్లు దుకాణంలో ఓ వ్యక్తి కల్లు తాగి మృతి చెందగా.. మరొకరు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలరం రేపింది.

 బాధితుల నిరసన..

ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబీకులు శనివారం బోధన్​ పట్టణంలోని ఎక్సైజ్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందాడని.. మృతిచెందిన వ్యక్తి సంబంధీకులు కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.