నిఘాలో ఏండ్లుగా పాగా!
- ఒంటిమీద ఖాకీ డ్రెస్ లేని శాఖల్లో కొనసాగుతూ దందాలు
- స్వప్రయోజనం కోసం అక్రమార్కులతో సంబంధాలు
- ఉన్నతాధికారుల తీరుపై అనుమానాలు
- నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో కొందరి తీరు
ప్రత్యేకప్రతినిధి, విజయక్రాంతి: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో కొందరు అధికారులు ఏళ్ల తరబడి పాగా వేశారు. ఇల్లరికం వచ్చిన అల్లుడి తరహాలో తిష్ట వేసి అధికారులతో అంటకాగుతూ అక్రమ దం దాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒంటిమీద డ్రెస్ వేయకుండా విధులు నిర్వహించే ఉద్యోగులైన ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, విజిలె న్స్‌లో ఏళ్ల తరబడి కొందరు పాతుకపోయా రు.
ప్రతి అంశాన్ని ప్రభుత్వానికి, జిల్లా స్థాయి లో ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికా రుల పనితీరుపైన ప్రభుత్వానికి రిపోర్ట్ చే యాల్సి ఉంటుంది. కానీ కొందరు అధికారులు తప్పు చేస్తే వారితో అంటకాగి నివేదిక లు పం పించకుండా ఏమీ తెలియనట్టుగా ఉంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
ఏళ్ల తరబడి అదే శాఖలో..
ఒంటి మీద ఖాకి డ్రెస్ లేకుండా ప్రత్యేక విభాగాల్లో విధులు నిర్వహిస్తూ ఏళ్ల తరబడి ఉన్న పరిచయాలను నెలవారీ వసూళ్లకు నిదర్శనంగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాకీ డ్రెస్ లేకుండా పనిచేసే కీలక విభాగాల్లో ఐదేళ్ల వరకు మాత్రమే విధులు నిర్వహించవచ్చు. ఐదేళ్లకు మించి తిష్ట వేయడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
అధికారుల్ని ప్రసన్నం చేసుకుంటూ రాజకీయ నాయకులు పైరవీలతో ఇక్కడే తిష్ట వేసినట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి అధికారుల వరకు ఉన్నారని ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు. పిడిఎస్ బియ్యం, ఇసుక దందా అధిక వడ్డీ ఆశ చూపడం, పశువుల అక్రమ రవాణా, పేకాటలపై ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది.
అక్రమార్కులతో ఈ శాఖలో తిష్టవేసిన అధికారులు సన్నిహిత సంబంధాలు కొనసాగి స్తూ ఆర్థిక బంధాన్ని బలపరుచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన కానిస్టే బుళ్లను నిఘా విభాగాల్లో తీసుకోకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవి కేవలం చెప్పుకుందుకే అనే విధంగా ఉన్నతాధికారుల తీరు ఉన్నట్లు తెలుస్తుంది.
అధికారుల తీరుకు నిదర్శనాలివే..
దేవరకొండ డివిజన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్ గతంలో సస్పెండ్ అయినప్పటికీ అతడిని నిఘా విభాగంలో కొనసాగించడం గమనార్హం. అదే డివిజన్‌లో పనిచేస్తున్న మరో నిఘా విభాగానికి చెందిన అధికారి మద్యం తాగి బైక్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణించాడు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు.. సంబంధిత అధికారికి ఆర్డర్ కాపీ ఇవ్వకుండానే మధ్యలోనే నిలిపివేయ డం అంతర్గతంగా పెద్ద చర్చకు దారి తీసింది.
అదే డివిజన్‌లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి పశువుల అక్రమ రవాణాల్లో పట్టుబ డిన వారి నుంచి సదరు పోలీసు అధికారి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకోగా ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తానని చెప్పడంతో డబ్బులు తీసుకున్న అధికారి నిఘా విభాగం అధికారికి నగదు ఇచ్చినట్లు తెలిసింది.
నల్లగొండ డివిజన్‌లోనూ అదే తీరు..
నల్లగొండ డివిజన్‌లో జాతీయ రహదారి సమీపంలోని ఒక పోలీస్ స్టేషన్ వద్ద ఏపీ నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్న పశువుల అక్రమ రవాణాపై పోలీస్ తరహాలో కేసులు పెట్టి పట్టుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే అందులోని కొన్ని పశువులను మాత్రమే గోశాలకు తరలించగా పట్టుకున్న పశువులకి, గోశాలకు తరలించిన వాటికి మధ్యన లెక్క పొంతనలేదని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాగే రెండు ఇసుక లారీలను పట్టుకొని ఒక లారీ ఓనర్ వద్ద డబ్బులు తీసుకొని వదిలేసినట్లు తెలుస్తుం ది.
ఇలాంటి నివేదికలు ఇవ్వకుండా డివిజన్ స్థాయిలో ఉన్నతాధికారి నిఘా విభాగం అధికారులను ప్రభావితం చేస్తున్నారని ఆ శాఖ నుండే వినిపిస్తుంది. ఒక పోలీస్ అధికారి వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయ త్నం చేయగా దేవరకొండ డివిజన్‌లో ప్రభు త్వ ఆసుపత్రిలో చికిత్స పొందగా ఈ సంఘటనకు సంబంధించిన విషయం బయటకు తెలియకుండా సంబంధిత అధికారి డబ్బులిచ్చి రాజీ చేసుకున్న విషయం బహిరంగ రహస్యమే.
పోలీస్ స్టేషన్‌లో రైటర్లుగా కొనసాగుతూ వచ్చిన ప్రతి అధికారిని ప్రస న్నం చేసుకుంటూ ఆర్థిక ప్రయోజనాలను చక్కదిద్దుతూ ఏళ్ల తరబడి డిప్యూటేషన్ పేరిట కొనసాగడం చర్చనీయాంశంగా మారుతుంది. వీళ్లు లేకపోతే స్టేషన్ నిర్వహణ కష్టమని స్టేషన్ అధికారులతో ఉన్నత అధికారులకు చెప్పించడం, రాజకీయ పలుకుబడి ఉపయోగించడంతో గత 15 నుంచి- 20 ఏళ్ల వరకు ఇక్కడే తిష్ట వేశారు. వారే కుటుం బ సభ్యులతో రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
జిల్లా కేంద్రంలో ఒంటిమీద ఖాకీ డ్రెస్ లేకుండా పనిచేసే ఒక అధికారిపై అతని ఇంటి వద్దనే ఓ మహిళ భర్త బంధువులు దేహశుద్ధి చేయ గా జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొం దిన విషయం హాట్ టాపిక్‌గా మారిం ది. అతని వ్యవహార శైలి తెలిసిన ఉన్నత అధికారులు కూడా ఏమీ తెలియనట్టుగా ఉండి అక్క డే కొనసాగించడంలో ఆర్థిక బంధం బలంగా ఉందని గుసగుసలు స్థానికంగా ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఆయనే కీలకమా?
ఉమ్మడి జిల్లాలో ఎస్సైగా పనిచేసిన అధికారి సర్కిల్, డివిజన్ స్థాయి అధికారిగా ఇదే జిల్లాలో పనిచేస్తూ అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను వెనుకేసుకురావడం, అక్రమాలకు సహకరించని కిందిస్థాయి అధికారులపై రాజకీయ నాయకుల వద్ద ఇతనితో ప్రయోజనం లేదుంటూ చెప్పి అతని పోస్టింగ్ మార్పించడంలో దిట్ట అని ఆ శాఖలో చర్చించుకుంటు న్నారు. తనకు రాష్ట్ర స్థాయిలో సంబంధాలు ఉన్నాయంటూ ఆ శాఖలో కీలక అధికారిని సైతం ఖాతర్ చేయడం లేదని తెలుస్తోంది.




