5 April, 2026 | 6:16 AM

ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం

05-04-2026 12:00 AM
  1. మోండా మార్కెట్‌లో జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు

వ్యాపారుల ఆందోళన పోలీస్ స్టేషన్ ముట్టడి

సికింద్రాబాద్‌లో జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్

సికింద్రాబాద్, ఏప్రిల్ 4(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని మోండా మార్కె ట్‌లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన రోడ్డు ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివే తలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఒక వైపు జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టగా మరో వైపు బాదితులు ఆ వారిని అడ్డుకుంటూ జేసీబీలకు అడ్డంగా వెల్లడంతో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకు న్న ఘర్షణ వాతావరణ రణరంగాన్ని తలపించింది.

వివరాలిలా ఉన్నా యి..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల పట్టణ పరిపాలన’ కార్యక్ర మంలో భాగంగా మహా నగరంలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ యుద్ధ ప్రాతి పదికన చేప ట్టింది.అత్యంత రద్దీ ప్రాం తాలైన సికింద్రా బాద్ రైల్వే స్టేషన్ పరిస రాలు, మోండా మార్కెట్ ప్రాంతా ల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం భారీగా ఆక్ర మణ తొలగింపు ప్రక్రియ చేపట్టారు.

హై కోర్టు కఠిన ఆదేశాల నేపథ్యంలో రంగం లోకి దిగిన అధికారులు, రహదారు లకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలు, తోపు డు బండ్లు, దుకా ణాల పొడిగింపులను జేసీ బీ వాహనంతో నిర్దాక్షిణ్యంగా తొలగించారు. కేవలం నోటీసులకే పరిమి తం కాకుండా, ఈసారి జీహెచ్ ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీ సులు సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.

దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకో ని ఫుట్ పాత్ ఆక్రమణల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోం ది. ‘ఎక్కడ అక్రమాలు కనిపించినా ఉపేక్షించే ప్రసక్తే లేదు‘ అని అధికారులు స్పష్టం చేస్తూ, జేసీబీలతో ఆక్రమణలను నేలమట్టం చేశారు.

శాశ్వత పరిష్కారమా? నామమాత్రమా?..

మోండా మార్కెట్ ప్రాంతంలో వేసిన పుట్పాత్ ఆక్రమణ ల తోగింపు గతంలో కూడా చేశారు. పలుమార్లు ఇటువంటి డ్రై వ్లు జరిగినప్పటికీ, అధికారులు వెళ్లగానే వ్యా పారులు మళ్లీ యథాస్థానానికి చేరుకోవడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి హై కోర్టు పర్యవేక్షణ ఉండటంతో ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తారా లేక కొన్ని రోజులు హడావిడి చేసి వదిలేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఒకవైపు పాద చారుల భద్రత, మరోవైపు వేలాది కుటుంబాల జీవనోపాధి మధ్య ఈ సమస్య ఎటు దారితీస్తుందోనని పలువురు పేర్కొంటున్నారు. మోండా మార్కెట్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరిట కొన్ని షాపులను కూల్చివేయడానికి అధికారులు జేసీబీలతో రంగంలోకి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాపారులు అడ్డుకున్నారు. వ్యాపారులు అధికారులతో వాగ్వా దానికిదిగి జేసీబీలపైకి దూసుకెళ్లారు. పోలీసుల సమక్షంలోనే అధికారులపై దాడికి యత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది.

వ్యాపారుల ఆగ్రహాన్ని చూసి భయభ్రాంతులకు గురైన జీహెచ్‌ఎంసీ సిబ్బంది అక్కడి నుండి పరుగులు తీశారు. వందలాది మంది వ్యాపారులు మోండా మార్కెట్ పోలీస్ స్టే షన్ను ముట్టడించారు. ఏళ్ల తరబడి ఇక్కడే వ్యాపారాలు చేసుకుం టున్నా మని, నోటీసులు ఇవ్వకుండా షాపులు కూల్చడం అన్యాయమని నినదించారు. స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.

పోలీస్ స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన..

అధికారుల చర్యలతో ఉపాధి కోల్పోతున్నామంటూ వీధి వ్యాపా రులు ఒక్కసారిగా ఆగ్రహాని గురయ్యారు.మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్య లో చేరుకున్న బాధితులు అక్కడే బైఠాయించి నిరస న తెలిపారు. తరతరాలుగా ఇక్కడే వ్యాపా రం చేసుకుంటూ కుటుంబా లను పోషించు కుంటున్నాం. ముందస్తు ప్రత్యామ్నాయాలు చూపకుండా ఉన్నపళంగా తొలగిస్తే మేమె లా బతకాలి?‘ అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, వ్యా పారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసు కుంది. వ్యాపారులు ఒక్కసారిగా మూకుమ్ముడిగా మార్కెట్ ఠాణాలోకి దూసు కెళ్ళారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేశారు.