28 August, 2026 | 4:12 AM

అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలి

28-08-2026 02:24 AM

ఎంపీ కె.లక్ష్మణ్

ముషీరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా బీఎల్ వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు.  గురువారం ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో బీజేపీ మహాంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రామ్ అధ్యక్షతన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ  అనర్హుల ఓట్లు తొలగించేలా, దొంగ ఓట్లు ఉండకుండా పార్టీ నాయకులు బీఎల్ వోలకు సహకారం అందించాలన్నారు. 

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ జాబితాలో నామోదు చేయించాలని సూచిం చారు.  ఎన్యూమరేషన్ ఫారాల భర్తీలో త ప్పులు రాసినవారు, 2002ఓర్ జాబితాలో పేర్లు లేనివారు ఎన్నికల సంఘం సూచించిన12రకాల గుర్తింపు కార్డుల్లో ఏదోఒకటి బీఎల్ వోలకు చూపించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ 20ఏళ్లకు ఒక్కసారి జరుగుతుందని, 12వ సారి ఈ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నదని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పావని, సుప్రియ, నియోజకవర్గ బీజేపీ జాయింట్ కన్వీనర్లు మహేష్ కుమార్, రఘు, రాష్ట్ర నాయకులు రామిరెడ్డి, శేషసాయి, శివాజీ, నవీన్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.