24 August, 2026 | 10:58 AM

Breaking News

ఐటీ టెక్నాలజీలో మీ పిల్లలను ప్రోత్సహించండి

13-05-2026 06:05 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరిగిన నేపథ్యంలో ఐటీ విభాగం లో గ్రామీణ పిల్లలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. బుధవారం విద్యాశాఖ వారోత్సవాల్లో అని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు చదువు తో పాటు సాంకేతిక అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ కి వెళ్తే బిరియాని గురించి ఆలోచించవద్దని జీవనోపాధికి ఉపయోగపడే హైటెక్ సిటీ గురించి ఆలోచించాలని ఆ దిశగా తల్లిదండ్రులు తమ పిల్లలను విజ్ఞానం వైపు మళ్ళించాలన్నారు.