వృద్ధాశ్రమంకు వంట సామాన్లు, పరుపుల వితరణ
పాల్వంచ,(విజయక్రాంతి): నవ లిమిటెడ్ సహకారంతో సరోజ వృద్ధాశ్రమంనకు వంట సామాన్లు,పరుపులు, మంచములు, గృహోపకరణాలు బుధవారం అందజేశారు. నవ లిమిటెడ్ పాల్వంచ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా మానవసేవ వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా భద్రాచలంలోని సరోజ వృద్ధాశ్రమం వంట సామాగ్రి, పరుపులు,మంచములు, గృహోపకరణాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ భద్రాచలం శ్రీ మృణాల్ శ్రేష్ట పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మానవసేవ వలంటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి సరోజ మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో, వృద్ధుల అవసరాలను 'నవ లిమిటెడ్'మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లగా వారు తక్షణమే స్పందించి నేడు వంట సామాగ్రి, పరుపులు,మంచములు, గృహపకరణాలు, దోమతెరలు, దుప్పట్లు, కండువాలు అందజేసినందుకు నవ లిమిటెడ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమములో డి.జి.ఎం (ఫైనాన్స్) శ్రీ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థ సమాజాభివృద్ధికి గత 46 సంవత్సరాలుగా చేస్తున్న ఆరోగ్యం,విద్య,జీవనోపాధి కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యఅతిథి సబ్ కలెక్టర్, భద్రాచలం శ్రీ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సరోజ వృద్ధాశ్రమానికి వంట సామాగ్రి, పరుపులు, మంచములు, గృహోపకరణాలు అందజేసిన నవ సి.ఎస్.ఆర్ కార్యక్రమాలను కొనియాడారు.






