సెలవు రోజుల్లో ఐక్యతతో ఆటలాడండి
13-05-2026 06:36 PM
బోథ్,(విజయక్రాంతి): వేసవికాలం సెలవుల్లో యువకులు ఐక్యతతో ఆటలాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పన్నాల శమిందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గ్రామంలో క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి చెందిన క్రీడాకారులకు పదివేల రూపాయలు సహాయాన్ని అందించి వాటితో క్రీడా సామాగ్రి కొనుగోలు చేసుకోవాలని కోరారు. వివిధ పట్టణాల్లో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో గ్రామానికి వచ్చి తమ స్నేహితులతో కలిసి ఆటలాడడం అభినందనీయమన్నారు. కలిసిమెలిసి చదువుకున్న వారంతా ఒకే చోట చేరి ఆటలాడడం పాత రోజులు గుర్తించుకునే విధంగా ఉంటాయన్నారు.






