5 న ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్ష
02-05-2026 09:41 PM
ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగుల సామూహిక నిరాహారదీక్ష నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి తెలిపారు. అన్ని రకాల ఉద్యోగులు నిరాహారదీక్షలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులతోపాటు వివిధ శాఖల ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సామూహిక దీక్షలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.






