సదాచార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన వస్త్రములు, మట్టెలు అందజేత
02-05-2026 09:43 PM
తుంగతుర్తి,(విజయ క్రాంతి): సూర్యాపేటలో సదాచార్ ట్రస్ట్ కార్యాలయంలో నిరుపేద వధువుకు నూతన వస్త్రాలు, మట్టెలు అందచేసినట్లు ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్త తెలియచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వధువు వైష్ణవి, వివాహం నిమిత్తం ట్రస్ట్ సభ్యుల సహకారంతో నూతన వస్త్రములు, మట్టెలు, పెళ్లికి సంబందించిన ఇత్తడి, స్టీల్ సామాను వధువు బంధువు విజయకు అందజేసినట్లు తెలిపారు.






