ఎమిరైట్స్ సర్వీసులు ప్రారంభం
- సుముఖత వ్యక్తం చేసిన సంస్థ వైస్ ప్రెసిడెంట్
- సీఎం రేవంత్‌రెడ్డితో మహమ్మద్ సార్హన్ భేటీ
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమిరైట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్హన్ శనివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎంతో చర్చించారు. ఎమిరైట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన సీఎంను కలిశారు.
హైదరాబాద్‌లో ఎమిరైట్స్ ఏ-38 సర్వీసులను ప్రారంభించేందుకు ఈ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుముఖత వ్యక్తం చేశారు. ఎమిరైట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్ర యాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరైట్స్ ఎంఆర్‌వో ఆపరేషన్స్ కొనసాగించాలని సీఎం సూచించారు.
విమాన సర్వీసులకు కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్శిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్‌షిప్‌నకు ముందుకు రావాలని సీఎం కోరారు. ఈ విషయంపై సానుకూలంగా ఎమిరైట్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ స్పందించారు.






