3 June, 2026 | 3:30 AM

సీఎం నేతృత్వంలోనే ఎన్నికలకు

03-06-2026 01:48 AM
  1. సోనియాగాంధీ దృఢ సంకల్పంతోనే తెలంగాణ ఏర్పాటు 
  2. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనే వెళతామని, మళ్లీ అధికారంలోకి వస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమా ర్ గౌడ్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగాగానే పాలన సాగుతోందని, పేదవాడి అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో మంగళవారం జాతీయ జెండాను ఆవిష్కరిం చిన అనంతరం మహేష్ కుమార్ మా ట్లాడారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న నాటి నుంచి సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తోందని, మిగిలిన రెండున్నరేళ్ల తెలంగాణ నిర్మాణానికి పాటు పడదామన్నారు. బంగారు తెలంగాణ అన్నవారి కుటుంబమే బంగారమైందని, ప్రజలకు మాత్రం ఏమి జరగలేద ని విమర్శించారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎంతోమంది త్యాగధనుల ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ ఏర్పడిందన్నా రు. తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, ఆమె ధృడ సంకల్పంతో ఎన్నో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాకారమైందన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవే రుస్తున్నామని, ఉచిత బస్సు నుంచి సన్నబియ్యం వరకు దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృధి, సంక్షేమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. మతాలు, కులాల పేరుతో రాష్ట్రంలో కుంపటి పెట్టాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విధానం లౌకిక వాదమని, మత సామరస్యపూర్వకంగా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు.