ఆసిఫాబాద్ సీఐగా నీలం రవి బాధ్యతల స్వీకరణ
27-07-2026 09:46 PM
ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ఆసిఫాబాద్ పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా నీలం రవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన బాలాజీ వరప్రసాద్‌ను ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న నీలం రవిని ఆసిఫాబాద్ కు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించడానికి ముందు నీలం రవి జిల్లా ఎస్పీ నితికా పంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన నీలం రవికి పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.






