27 July, 2026 | 10:21 PM

రైతులకు విజయ డైరీ లోన్ సౌకర్యం

27-07-2026 09:38 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రైతులకు విజయ పాల డైరీ లోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు  బొంకూరి ఐలయ్య యాదవ్ సోమవారం తెలిపారు. మండలంలోని రైతులకు పాడి ఆవులు, బర్లు కొనుగోలు చేసేందుకు రెండు లక్షల రూపాయలను లోన్ రూపంలో అందిస్తుందని రైతులు పాడి ఆవులు, బర్ల కొనుగోలు చేసుకుని వాటి ద్వారా వచ్చే పాలను విజయ డైరీకి అందించి పాలకు వచ్చే డబ్బుల ద్వారా లోను చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకొని పాల ఉత్పత్తిని పెంచేందుకు తోడ్పడునందించాలని సూచించారు. మండలంలో ఎ గ్రామ రైతులకైనా ఈ అవకాశం వర్తిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 98499 18991 లో సంప్రదించాలన్నారు.