27 July, 2026 | 10:27 PM

కేరళ టాలెంట్ స్కూల్లో రోడ్డు భద్రత అవగాహన

27-07-2026 09:54 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని కేరళ టాలెంట్ స్కూల్‌లో రోడ్డు భద్రత,మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎంవీఐలు ఉదయ్ కుమార్,మహమ్మద్ రఫీ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, 18 ఏళ్లలోపు పిల్లలు,విద్యార్థులు వాహనాలు నడపరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణించవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ జరగదన్నారు. కామారెడ్డి జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నిర్మలా జిమ్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.