27 July, 2026 | 10:27 PM

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి

27-07-2026 09:56 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గాజుల పోతన్న ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా కాకుండా ఒక శాస్త్రవేత్తగా దేశానికి ఎంతో సేవ చేశారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భాసెట్టి సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతన్న ,అమృతరావ్, శ్రీనివాస్, హైమద్ ,తదితరులు ఉన్నారు.