27 July, 2026 | 10:27 PM

ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

27-07-2026 09:51 PM

గజ్వేల్: గజ్వేల్ రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాను ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరి మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్ధార్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని, నాణ్యమైన విత్తనాలను రైతు వేదికలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.