8 July, 2026 | 2:40 PM

అగ్రిమెంట్‌ బయటపెట్టు.. రాజీనామాకు సిద్ధం.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

08-07-2026 01:34 PM
  1. నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నింపట్లేదు
  2. అబద్ధాలకు చొక్కా తొడిగితే రేవంత్ రెడ్డి
  3. అబద్ధాల్లో నోబెల్ ఇవ్వాల్సిఉంటే.. రేవంత్ రెడ్డికే

హైదరాబాద్:  కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram Projectమాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ లో ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు.. ఒకవేళ అనుమతి ఇచ్చింది నిజమే అయితే.. రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని బయట పెడితే 'నేను రాజీనామా చేయడానికి సిద్ధం, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి' అని హరీశ్ రావు సవాల్ విసిరారు.  నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నింపట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో 90 శాతం చెరువులు ఎండిపోయాయని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయట్లేదని పేర్కొన్నారు. మోటార్లు ఆన్  చేయకుండా నీళ్లను దిగువకు వదులుతున్నారని ఆరోపించారు. గురు దక్షిణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి నీళ్లను వదులుతున్నారని ఫైర్ అయ్యారు.

నీళ్లు ఉండి కూడా.. లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ అన్నారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడిన మిమ్మల్ని ఉరితీసినా తప్పులేదని ద్వజెమెత్తారు. ఎన్ నినో వల్ల ప్రపంచం బాధపడుతుందన్న హరీశ్ రావు నీళ్లు ఉండి కూడా వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం సెల్లు తప్ప.. ఏదీ నిజం లేదని విమర్శించారు. అబద్ధాలకు చొక్కా తొడిగితే రేవంత్ రెడ్డిగా ఉంటుందని ఎద్దేవా చేశారు. అబద్ధాల్లో నోబెల్ ఇవ్వాల్సి ఉంటే.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే తుమ్మిడిహట్టికి ఒప్పందం అయినట్లు సీఎం రేవంత్ చెప్పారు. తుమ్మిడిహట్టికి రూ. 6500 కోట్లు ఖర్చు పెట్టినట్లు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 8 ఏళ్లు కేంద్రం, రాష్ట్రం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిమట్టిలో తుట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారు.

పనులు చేయకుండా తుమ్మడిహట్టి పేరిట రూ.2,328 కోట్లు, మొబిలైజేషన్ అడ్వాన్స్ లు(Mobilization advances) పేరిట కాంగ్రెస్ నేతలు 2,328 కోట్లు తిన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని తొలగించామని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టికి అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రిని కలిసినట్లు హరీశ్ రావు వివరించారు. కాంగ్రెస్ సీఎంలు కోరితేనే ఇవ్వలేదు.. మీకు ఎలా ఇస్తామని ప్రశ్నించారని వెల్లడించారు. తుమ్మిడిహట్టి నిర్మాణానికి అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. తుమ్మిడిహట్టి(Tummidihetti Barrage) నుంచి ప్రాజెక్టును కావాలని మార్చలేదన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్రం లేఖ రాసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసత్య మాటలు మాట్లాడటం ఇప్పటికైనా మానాలని హరీశ్ రావు హెచ్చరించారు. తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు తుమ్మిడిహట్టి నిర్మిస్తామని.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో(Congress Manifesto) పెట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చి రెండున్నరేళ్లు అయినా తుమ్మిడిహట్టి కోసం ఏం చేసింది? అని హరీశ్ రావు ప్రశ్నించారు.