12-02-2026 02:16:39 AM
తల్లి, శిశువు సురక్షితం
పెబ్బేరు ఫిబ్రవరి 11: మండల పరిధిలోని యాపర్ల గ్రామానికి చెందిన భూమిక అనే గర్భిణి మహిళ బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా తీవ్రమైన పురిటి నొప్పులతో బాధపడింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర సేవలైన 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో విధులు నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ టెక్నీషియన్ రాము, పైలెట్ మైనుద్దీన్ తక్షణమే యాపర్ల గ్రామానికి చేరుకున్నారు.
గర్భిణిని అంబులెన్స్లోకి ఎక్కించి వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, పెబ్బేర్‌కంచిరావుపల్లి గ్రామాల మధ్య మార్గమధ్యంలోనే ప్రసవ వేదనలు మరింతగా పెరిగాయి.పరిస్థితిని గమనించిన 108 సిబ్బంది అ ప్రమత్తమై, ఎలాంటి ఆలస్యం చేయకుండా అంబులెన్స్లోనే అవసరమైన వైద్య సహాయాన్ని అం దించారు. అత్యవసర పరిస్థితుల్లోనూ అత్యంత నైపుణ్యంతో వ్యవహరించిన టెక్నీషియన్ రాము, పైలెట్ మైనుద్దీన్ సహకారంతో భూమిక అంబులెన్స్లోనే సుఖ ప్రసవం చేసి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రసవం అనంతరం తల్లి, శిశువును పూర్తిగా సురక్షితంగా వనపర్తి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇది భూమికకు నాలుగవ కాన్పు కాగా, సమయానికి 108 సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి తప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అ త్యవసర సమయంలో అద్భుత సేవలందించిన 108 సిబ్బంది రాము, మైనుద్దీన్లకు భూమిక భ ర్త శివానంద్ సహా కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 108 అత్యవస ర సేవల వేగవంతమైన స్పందన మరోసారి ప్రాణాలను కాపాడిందని స్థానికులు ప్రశంసించారు.